ఏసీబీ కేసుతో వచ్చిన ఇబ్బందేమీ లేదు -కేటీఆర్ 20 h ago
TG : లొట్టపీసు కేసు.. లొట్టపీసు ముఖ్యమంత్రి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏసీబీ కేసుతో వచ్చిన ఇబ్బందేమీ లేదని చెప్పారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు అగమ్యగోచరం.. చావునోట్లో తలపెట్టి కేసీఆర్ రాష్ట్రం సాధించారని తెలిపారు. రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. అప్పుడు ఉన్న ఇబ్బందులతో ఇవేమీ పెద్దవి కావు అని చెప్పారు. ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసులకు భయపడా అని అన్నారు. ఏడాది పాలన గడిచినా హామీలు అమలు కావడంలేదని మండిపడ్డారు. రైతు భరోసా కోసం ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. రేవంత్ సర్కార్ రూపాయి కూడా రైతు బంధు ఇవ్వలేదని తెలిపారు. రుణమాఫీ అంతా మోసం.. రుణమాఫీ జరగలేదని స్పష్టం చేసారు. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తప్పారని విమర్శించారు. అప్పులు చేశామని మాపై తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకంపం వచ్చినా మేడిగడ్డ బ్యారేజ్‌కు ఏమీ కాలేదని వెల్లడించారు. మరమ్మతులు చేసి నీళ్లు ఇచ్చే యత్నం చేయలేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.